Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, నవంబర్ 25, 2024: టెలికాం రంగంలో పారదర్శకతను పెంచేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. TRAI ప్రకారం, టెలికాం ఆపరేటర్లు తమ వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లలో జియోస్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను అందించాలి.

ఈ మార్గదర్శకాలు Airtel, Jio, Vodafone వంటి అన్ని కంపెనీలకు వర్తిస్తాయి. ఇవి వినియోగదారులకు ఏ ప్రాంతంలో ఏ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో క్లియర్‌గా తెలుసుకుందాం..

నెట్‌వర్క్ కవరేజ్ వివరాలు వినియోగదారులకు అందుబాటులో ఇకపై వినియోగదారులు కొత్త సిమ్‌ కొనుగోలు చేసే సమయంలో తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ గురించి ముందే తెలుసుకోవచ్చు.

TRAI ఈ చర్యను వినియోగదారులకు సేవల నాణ్యతను మెరుగుపరచడం కోసం తీసుకుంది. ప్రతి టెలికాం ఆపరేటర్ వివరణాత్మక సమాచారం, అంచనా నాణ్యతతో మ్యాప్‌లో తమ కవరేజ్‌ను ప్రదర్శించాలి.

క్లియర్ కవరేజ్ సమాచారం వెబ్‌సైట్, యాప్‌లో తప్పనిసరి టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మ్యాప్‌ల ద్వారా కవరేజ్ సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ మ్యాప్‌లు వైర్‌లెస్ వాయిస్, బ్రాడ్‌బ్యాండ్ సేవల వివిధ సాంకేతికతలకు అందుబాటు లో ఉన్న ప్రాంతాలను కలర్ కోడింగ్ ద్వారా చూపుతాయి. వినియోగదారులు ఒక క్లిక్‌తో ఈ సమాచారాన్ని పొందేందుకు హోమ్‌పేజీలోనే లింక్ అందుబాటులో ఉండాలని TRAI సూచించింది.

TRAI కవరేజ్ మ్యాప్‌ల కోసం కొన్ని ప్రమాణాలను కూడా సెట్ చేసింది. మ్యాప్‌లో చూపబడే డేటా నిజమైనదిగా ఉండటంతో పాటు, కనీస సిగ్నల్ శక్తి వంటి అంశాలను కూడా స్పష్టంగా చూపాల్సి ఉంటుంది. నాణ్యతా ప్రమాణాల కోసం రూపొందించిన ఈ మార్గదర్శకాలు 2024 అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయని TRAI ప్రకటించింది.

భారతదేశంలోని వినియోగదారులకు తమ ప్రాంతంలో నెట్‌వర్క్ సేవల లభ్యత గురించి స్పష్టత కల్పించడమే TRAI ఈ చొరవ వెనుక ఉద్దేశం. ఇప్పటివరకు ఈ విషయంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మార్గదర్శకాలతో సులభతరం అవుతాయని TRAI విశ్వసిస్తోంది.

ఈ మార్గదర్శకాల ద్వారా భారత టెలికాం రంగం వినియోగదారుల కోసం మరింత మెరుగైన సేవలను అందించగలదని ఆశిస్తున్నారు.

error: Content is protected !!