365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 1, 2023: చావు నోట్లో తల పెట్టి బతికొచ్చిండు.. చావునోట్లో అంటే చావు అంచులదాకా వెళ్ళొచ్చాడన్నమాట. పొద్దుపొద్దున్నే ఎంతపని జరిగింది..? ట్రైన్ కు బంధువుల దగ్గరకు వెళ్లడానికి సిద్దమైన ఓ వ్యక్తి. ట్రైన్ ఎక్కేందుకు టిక్కెట్ తీసుకొని వస్తుండగా మధ్యలో గూడ్సు రైలు అడ్డంగా ఉంది. దీంతో దానికింద నుంచి అవతిలికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా రైలు కదిలింది.
https://www.youtube.com/shorts/lq6CboocWTU
వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి అలాగే కదలకుండా గూడ్సు రైలుకింద ఉండిపోయాడు. అదేసమయంలో అక్కడున్నవాళ్ళంతా పెద్దగా కేకలు వేయడంతో ట్రైన్ డ్రైవర్ ట్రైన్ ను ఆపేశాడు. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో జరిగింది.
https://www.youtube.com/shorts/lq6CboocWTU
ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామానికి చెందిన ప్రయాణికుడు ఆకుల పెద్దబాబు (56) ట్రైన్ కిందకు దురగా ట్రైన్ కదిలింది. అదే సమయంలో అప్రమత్తమవ్వడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ సమయంలో అతడి ఎడమచెయ్యి మనికట్టు వరకు తెగిపోవడంతో క్షతగాత్రుణ్ణి హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రవేట్ హాస్పటల్ కు తరలించారు.