365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 21,2024: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు, డిజిటల్ చెల్లింపులను పెంచేందు కు దక్షిణ మధ్య రైల్వే (SCR) సాధారణ బుకింగ్ కౌంటర్లలో టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ‘క్యూఆర్’ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
ఈ చొరవ ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నారు SCR అధికారులు. పైలట్ ప్రాజెక్టుగా ఎస్సీఆర్ సికింద్రాబాద్ డివిజన్‌లోని 14 స్టేషన్లలో 31 కౌంటర్లలో దీన్ని అమలు చేస్తున్నారు.

టిక్కెట్ విండో వెలుపల ఉన్న సాధారణ బుకింగ్ కౌంటర్‌లలో ఫేర్ రిపీటర్‌లు అందిస్తారు. మరింత ఖచ్చితత్వం,పారదర్శకత కోసం ప్రయాణీకులు తనిఖీ చేయగల వివరాలను ప్రదర్శిస్తారు. స్టేషన్ నుంచిస్టేషన్ వరకు, తరగతి, పెద్దలు లేదా పిల్లల సంఖ్య, ఛార్జీలు మొదలైన వివరాలు ఉంటాయి.
ఇప్పుడు, ఛార్జీని లెక్కించిన తర్వాత రూపొందించబడిన క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్ ఫేర్ రిపీటర్‌లలో ప్రదర్శించబడుతుంది. మొబైల్ ఫోన్‌లోని చెల్లింపు యాప్‌ల ద్వారా ప్రయాణీకుడు దానిని స్కాన్ చేయవచ్చు. మొత్తం రసీదుని నిర్ధారించిన తర్వాత, టికెట్ జనరేట్ అయ్యి, ప్రయాణీకుడికి జారీ అవుతుంది.

సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల్, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జి, సిర్పూర్ ఖాగజ్‌నగర్, వికారాబాద్ స్టేషన్లలో ఈ నగదు రహిత లావాదేవీని తొలుత అమలు చేశారు.
ఇది కూడా చదవండి.. భారతదేశంలో పెరుగుతున్నసైబర్ ముప్పు..
ఇది కూడా చదవండి.. ప్రధాని మోదీ సందేశంపై ఎన్నికల సంఘం సీరియస్..
ఇది కూడా చదవండి.. Vivo T3 5G బుకింగ్స్ ప్రారంభం..