Wed. Dec 25th, 2024
craft_

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి29, 2023: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇన్ కమ్యూనిటీ సైన్స్(CAFT)లో సుస్థిర పోషక ఆహార విధానాలు అనే అంశంపై మూడు వారాల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.

రాజేంద్రనగర్ లోని ‘క్యాప్ట్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్. సుధీర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950, 60 దశకాలలో ఆహార ఉత్పత్తులు పెంచడం వంటి అంశాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుంటే, ప్రస్తుతం ఆర్గానిక్ పద్ధతులలో పంట ఉత్పత్తులు పెంచడం ప్రధాన లక్ష్యంగా మారిందన్నారు.

craft_

ఆహార భద్రతతో పాటు పోషకాహార భద్రత ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం అన్నారు. ఈ మూడు వారాల శిక్షణ కార్యక్రమం ప్రధాన అంశాలను డీన్ కమ్యూనిటీ సైన్స్ డాక్టర్ రత్నకుమారి వివరించారు. ఈ సందర్భంగా మిల్లెట్స్ పై ఈ.ఎల్.పి విద్యార్థులు రూపొందించిన క్యాలెండర్ ను రిజిస్ట్రార్ ఆవిష్కరించారు.

ఈ శిక్షణలో వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ డాక్టర్ సుప్రజ, డైరెక్టర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ జమునా రాణి, కోర్సు- కోఆర్డినేటర్లు డాక్టర్ జానకి, డాక్టర్ ప్రియా సుగంధి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!