365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూలై 27,2023: చేతి రాత తో మనస్సు ప్రశాంతంగా ఉంటుందని లయన్ జి.కృష్ణ వేణి,లయన్ డా.పి. స్వరూపా రాణి, డా.హిప్నో పద్మా కమలాకర్, అన్నారు.
నవభారత లయన్స్ క్లబ్ , డా.హిప్నోకమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో దోమల గుడా లోని హైదర్ గుడా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో బుధవారం ఉదయం నోట్ పుస్తకాలు, పోషకాహారం , స్నాక్స్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లయన్ డా.హిప్నో పద్మా కమలాకర్, లయన్ కృష్ణ వేణి,లయన్ డా.పి. స్వరూపా రాణి , స్కూల్ టీచర్స్ ఉమా సత్యరేఖ, ప్రవీణ , వినయ్ కుమారి పాల్గొన్నారు. రాత మరచిపోయిన జ్ఞాపకాలను తిరిగి తీసుకురాగలుకు తుందన్నారు.
మెదడును పదునుగా, చురుకుగా ఉంచుతుందన్నారు. ఒక గొప్ప మానసిక వ్యాయామని చెప్పారు. కల్పిత కథలు రాయడం వల్ల విషయాలను విశ్లేషించి, వాటిని వేరే కోణంలో చూడగలుగుతారు న్నారు. మౌఖిక కమ్యూనికేషన్ పెరుగుతుందన్నారు .
తద్వారా పని చేయడం, సమస్యలను పరిష్కరించడం, జీవితాన్ని ఆస్వాదించడం తెలుస్తుందన్నారు. సంతోషకరమైన జ్ఞాపకాలు మీ ముఖంపై చిరునవ్వును కలిగిస్తాయని తెలిపారు.
డా.హిప్నో పద్మా కమలాకర్,లయన్ జి.కృష్ణ వేణి,లయన్ డా.పి. స్వరూపా రాణి..