365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, జూన్ 23, 2025: భారత వాణిజ్య రంగంలో వేగంగా పెరుగుతున్న రుణ అవసరాలను మరింత సమర్థంగా తీర్చేందుకు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ కీలక ముందడుగు వేసింది. సంస్థ తన సాంకేతిక వైభవాన్ని మరోసారి చాటుతూ, అభివృద్ధి చెందిన క్రెడిట్ రిస్క్ మోడల్ క్రెడిట్ విజన్® సిబిల్ కమర్షియల్ ర్యాంక్ (CV CMR)‌ను ఆవిష్కరించింది. ఇది రుణదాతలకు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడంతో పాటు, వాణిజ్య రుణాల ప్రవాహాన్ని మరింత వేగవంతం చేయనుంది.

2017లో ప్రారంభమైన ప్రాథమిక CMR ఆధారంగా ఇప్పటికే పరిశ్రమలో 60%కి పైగా వాణిజ్య రుణాలు మంజూరవుతుండగా, ఇప్పుడు కొత్తగా రూపొందించిన CV CMR మోడల్ మరింత లోతైన విశ్లేషణలు, ఎక్కువ వ్యవధి డేటా పరిశీలన (24 నుంచి 36 నెలలు),విస్తృత రుణగ్రహీత కవరేజీని కలిగి ఉంది.

Read This also…TransUnion CIBIL Launches Next-Gen CreditVision® CMR to Boost Commercial Lending in India..

Read This also…Canon India Appoints Kiran Deohans and Sudhir Koushik as New Cinema EOS Ambassadors..

CV CMR ముఖ్య ఫీచర్లు:
స్థిరత: మూడు నెలల వ్యవధిలో >90% రుణగ్రహీతలు అదే ర్యాంక్ లేదా ±1 ర్యాంక్‌లో ఉంటారు.

రిస్క్ డిఫరెన్షియేషన్: CMR-1 (కనీస రిస్క్) నుంచి CMR-10 (గరిష్ఠ రిస్క్) వరకు ర్యాంక్‌లు ఉండగా, డిఫాల్ట్ రేట్లు 0.9% నుంచి 98.3% వరకు మారుతూ ఉంటాయి.

అధిక ఎంపిక అవకాశాలు: Inquiry దశలోనే ~5-7% అదనపు రుణగ్రహీతల్ని సులభంగా గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది.

రుణ అర్హత పెంపు: సుమారు 12% మేరగా కొత్తగా ర్యాంక్ పొందే వ్యాపారాలకు CV CMR మార్గం చూపిస్తుంది.

రుణదాతల నుంచి స్పందన:
భావేష్ జైన్, ట్రాన్స్‌యూనియన్ సిబిల్ MD & CEO మాట్లాడుతూ:

“ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే ప్రధాన శక్తిగా మారుతున్నాయి. వీటికి సమర్థవంతమైన రుణ అంచనా వ్యవస్థను అందించడం ద్వారా అభివృద్ధికి బలమైన పునాది వేస్తాం.”

రాజీవ్ సబర్వాల్, టాటా క్యాపిటల్ MD & CEO:

“CV CMR వంటి మోడల్స్ మార్కెట్ డైనమిక్స్‌ను ప్రతిబింబిస్తూ రిస్క్ అంచనాను మరింత ప్రభావవంతంగా చేస్తాయి.”

ఇది కూడా చదవండి…విడిగా విక్రయించే టీలో కల్తీ.. ఎలా గుర్తించాలి..? ఎలా నివారించాలి..?

ఇది కూడా చదవండి…ఇంటికే వచ్చి ఆరోగ్య పరీక్షలు చేసే అమేజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభం..

రవీందర్ సింగ్, ఎస్‌వీసీ కో-ఆపరేటివ్ బ్యాంక్ MD:

“CV CMR మోడల్ ద్వారా మేము మరింతగా చిన్న వ్యాపారాలకు చేరువవవచ్చు.”

సంజయ్ అగర్వాల్, అంబిట్ ఫిన్‌వెస్ట్ CEO:

“స్పష్టమైన రిస్క్ ర్యాంక్‌లతో మేము ధృవపరిచిన విధంగా, మదింపు వేగంగా, ఖచ్చితంగా జరుగుతుంది.”

వృద్ధికి దోహదపడుతున్న ప్రభుత్వ పథకాలు:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 94 లక్షల వాణిజ్య రుణగ్రహీతలు ఉండగా, 2020తో పోలిస్తే ఇది 1.5 రెట్లు పెరిగింది. ఇందుకు PMMY, CGTMSE, GeM, TReDs, OCEN, ONDC వంటి ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు పెద్దగా దోహదపడ్డాయి. ఇవి వాణిజ్య రుణాలకు సానుకూల వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, CV CMR వంటి సాధనాల వినియోగాన్ని పెంపొందించాయి.