365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 26, 2023: పంజాబ్ ను ప్రధాన పర్యాటక ప్రాంతంగా నిలపాలన్న ఉద్దేశంతో సెప్టెంబరు 11 నుంచి 13వ తేదీ వరకు మొహాలీలో టూరిజం సమ్మిట్ అండ్ ట్రావెల్ మార్ట్ నిర్వహించనున్నట్లు పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అన్మోల్ గగన్ మాన్ తెలిపారు.
హైదరాబాదులో ‘పంజాబ్ టూరిజం రోడ్డు షో’ సందర్భంగా బంజారా హిల్స్ లోని పార్కు హయత్ హోటల్ లో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ల్యాండ్‌మార్క్ ఈవెంట్ పంజాబ్‌ను ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా నిలుపుతుందన్నారు.
రాష్ట్ర విస్తారమైన వారసత్వం, సంప్రదాయాలు, కళారూపాలు, ఆచార వ్యవహారాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విదేశీ, దేశీయ టూర్ ఆపరేటర్లు, డీఎంసీలు, డీఎంవోలు, ట్రావెల్ ట్రేడ్ మీడియా, ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, హోటల్ ఆపరేటర్లు, బీ&బీ, ఫామ్ స్టే ఓనర్‌లు, టూరిజం బోర్డులు పాల్గొననున్నాయని తెలిపారు.
ఈ డైనమిక్ కన్వర్జెన్స్‌తో పంజాబ్ ఒక ప్రధాన ప్రపంచ పర్యాటక హాట్‌స్పాట్‌గా మారనుందన్నారు. ఐదు ప్రముఖ నగరాలు అమృత్‌సర్, రూప్‌నగర్, లూథియానా, పాటియాలా, ఫతేఘర్ సాహిబ్ ఇప్పటికే విదేశీ పర్యాటకుల దృష్టిని ఆకర్షించాయన్నారు. 2030 నాటికి ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారేందుకు వేదికను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
దీంతో భారతీయ పర్యాటక రంగంలో పంజాబ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని పర్యాటక శాఖ భావిస్తోందని తెలిపారు.ఈ సమ్మిట్ కోసం పర్యాటక శాఖ దేశమంతటా రోడ్‌షోలను నిర్వహిస్తోందన్నారు. మొదటి రోడ్‌షో జైపూర్‌లో నిర్వహించామని తెలిపారు. తర్వాత ముంబైలో, ఇప్పుడు హైదరాబాద్ చేస్తున్నామబి చెప్పారు. ఢిల్లీలో రోడ్‌షో జరగనుందన్నారు.
పంజాబ్ ప్రభుత్వం పర్యాటకాన్ని మెరుగుపరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ, దేశీయ సందర్శకులను ఆకర్షించనున్నామన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా వ్యాపార సౌలభ్యం, పర్యాటక ఆకర్షణ పరంగా రాష్ట్ర ప్రతిష్టను పెంచడం మా లక్ష్యమన్నారు.
ఇటీవలి పెట్టుబడి సంబంధిత విజయ కథలతో పాటు పర్యాటకం, ఆతిథ్య రంగంలో ప్రత్యేకమైన ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలను వివరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ టూరిజం అండ్ కల్చరల్ అఫైర్స్, టూరిజంలో వెల్నెస్ రాఖీ గుప్తా భండారీ మాట్లాడుతూ టూరిజంలో వెల్నెస్ మహిళలు అనే రెండు కీలక కార్యక్రమాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమాలు పంజాబ్ నిర్మలమైన పరిసరాలను, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని వెల్నెస్ కోరుకునేవారిని ఆకర్షించడానికి పర్యాటక పరిశ్రమలో మహిళలకు సాధికారత కల్పించడానికి ప్రయత్నిస్తాయన్నారు. వెల్‌నెస్ హబ్‌గా మారాలనే పంజాబ్ ఆకాంక్ష సజావుగా సాగుతుందని తెలిపారు.
పర్యాటకరంగంలో మహిళలకు సాధికారత కల్పించడం సామాజిక ఆర్థిక వృద్ధికి హామీ ఇస్తుందన్నారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, శిక్షణ, ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా సానుకూల మార్పును లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.