365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అనకాపల్లి, ఏప్రిల్ 29,2023: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ రిలయన్స్ రిటైల్, ట్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని చోడవరం పట్టణంలో నూతన స్టోర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
చోడవరంలోని ట్రెండ్స్ స్టోర్ లేటెస్ట్ కలెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఈ ప్రాంతంలోని వినియోగదారులకు నచ్చే అద్భుతమైన నాణ్యమైన, ఫ్యాషన్ బ్రాండ్స్ ఉన్నాయి. ఉమెన్ వేర్, మెన్ వేర్, కిడ్స్ వేర్, ఫ్యాషన్ ఉపకరణాలు అతితక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
చోడవరం పట్టణంలో 5567 చదరపు అడుగుల స్టోర్‌లో అద్భుతమైన ధరలతో పాటు వినియోగదారులకు ప్రత్యేక ప్రారంభ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.3999కి షాపింగ్ చేయండి.. రూ.249తో అద్భుతమైన బహుమతులు పొందవచ్చు. కస్టమర్లు రూ.3999 కొనుగోలుపై రూ.2000 విలువైన కూపన్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు.