365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆంధ్రప్రదేశ్,జనవరి 6,2026: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని, ప్రముఖ దుస్తుల రిటైల్ చెయిన్ ‘ట్రెండ్స్’ (Trends) తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన పండుగ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘ట్రెండ్స్ సంక్రాంతి స్పెషల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాషన్‌తో పాటు సంప్రదాయం ఉట్టిపడేలా సరికొత్త దుస్తుల శ్రేణిని అందుబాటులోకి తెచ్చింది.

రూ. 3,499 షాపింగ్‌పై ఆకర్షణీయమైన బహుమతులు
పండుగ షాపింగ్‌ను మరింత ఉత్సాహంగా మార్చేందుకు ట్రెండ్స్ ఆకర్షణీయమైన రివార్డులను ప్రకటించింది. రూ. 3,499 లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి షాపింగ్ చేసే వినియోగదారులు ప్రత్యేకమైన బహుమతులు పొందే అవకాశాన్ని కల్పించింది. “సంక్రాంతి షాపింగ్.. ఇప్పుడు మరింత రివార్డింగ్” అనే నినాదంతో కస్టమర్లకు మరింత విలువను జోడించాలని ట్రెండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

అందరికీ అందుబాటులో లేటెస్ట్ ఫ్యాషన్
మెట్రో నగరాల నుండి చిన్న పట్టణాల వరకు ఫ్యాషన్‌ను సామాన్యులకు చేరువ చేయడంలో ట్రెండ్స్ ముందంజలో ఉంది. సరసమైన ధరలకే అత్యుత్తమ శైలిని అందించడం వల్ల ఇది భారతీయులకి అత్యంత ఇష్టమైన ఫ్యాషన్ గమ్యస్థానంగా మారింది. సంక్రాంతి పండుగ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రాంతీయ అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్ కలెక్షన్‌ను రూపొందించారు.

ఒకే చోట కుటుంబం అంతటికీ కావాల్సినవి
ఈ సంక్రాంతికి ట్రెండ్స్ స్టోర్లలో సరికొత్త వెరైటీలు కొలువుదీరాయి:

ఉమెన్స్ వేర్: పండగ శోభను ఇచ్చే చీరలు, కుర్తీలు, వెస్ట్రన్ వేర్.

మెన్స్ వేర్: క్లాసిక్ కుర్తా పైజామాలు, మోడ్రన్ షర్ట్స్,క్యాజువల్స్.

Read this also:Trends Announces ‘Sankranti Special’ Campaign: Festive Shopping Gets More Rewarding

ఇదీ చదవండి :ఆరోగ్యం విషయంలో విటమిన్లు, ఖనిజాల పాత్ర ఏమిటి..?

కిడ్స్ వేర్: చిన్నారుల కోసం రంగురంగుల పండగ దుస్తులు.

యాక్సెసరీస్: డ్రెస్సులకు తగినట్టుగా ఉండే ఫ్యాషన్ ఉపకరణాలు.

ఇదీ చదవండి :చాట్‌జీపీటీ ఫేక్ ఇన్ఫోపై సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు..

ఇదీ చదవండి :డేటా సెంటర్ల భవిష్యత్తు కష్టమేనా..? పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్.. !

మొత్తం కుటుంబానికి కావాల్సిన ఫ్యాషన్ వస్తువులన్నీ ఒకే చోట లభిస్తుండటంతో, సంక్రాంతి షాపింగ్‌కు ట్రెండ్స్ ‘వన్-స్టాప్’ గమ్యస్థానంగా నిలుస్తోంది. మీ సమీపంలోని ట్రెండ్స్ స్టోర్‌ను సందర్శించి, పండుగ వేళ సరికొత్త లుక్‌తో పాటు అద్భుతమైన బహుమతులను కూడా సొంతం చేసుకోండి.