365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 6,2024: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహా పరినిర్వాణ దినాన్ని (వర్ధంతి) శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.
విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ స్ఫూర్తి, ఆయన సందేశాల్ని స్మరించుకుంటూ అత్యంత గౌరవంతో నిర్వహించారు.