365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వాషింగ్టన్,జనవరి 20,2026: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో విదేశీ వ్యవహారాల్లో సంచలనం సృష్టించారు. ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి అయ్యే వైన్, షాంపేన్‌లపై ఏకంగా 200 శాతం టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన హెచ్చరించారు. తన ప్రతిపాదిత ‘బోర్డ్ ఆఫ్ పీస్’ (శాంతి మండలి)లో చేరేందుకు ఫ్రాన్స్ నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ASME EFx India 2026 Concludes, Showcasing Emerging Engineering Talent from Across India

ఇదీ చదవండి..జూబ్లీ హిల్స్‌లో తమ 20వ క్లినిక్ ‘లేయర్స్ ప్రైవ్’ బ్రాంచ్ ను ప్రారంభించిన లేయర్స్ క్లినిక్స్..

ప్రైవేట్ మెసేజ్ బహిర్గతం: కేవలం హెచ్చరికలతో ఆగకుండా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తనకు పంపిన ఒక వ్యక్తిగత సందేశాన్ని (Private Message) ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో షేర్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గ్రీన్ ల్యాండ్ అంశంపై మాక్రాన్ తన సందేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.

ఇదీ చదవండి..ఢిల్లీ, గౌహతిల్లో కోక్ స్టూడియో భారత్ లైవ్ మ్యాజిక్.. శ్రేయా ఘోషల్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేజ్!

Read this also..Rashmika Mandanna Stars in Signify’s New ‘Fans Reimagined’ Campaign..

వివాదం నేపథ్యం ఇదే.. గాజా పునర్నిర్మాణం,ప్రపంచ శాంతి కోసం ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగస్వామి కావాలని ఫ్రాన్స్‌ను కోరగా, అందుకు మాక్రాన్ నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. “నేను వారి వైన్, షాంపేన్‌లపై 200 శాతం సుంకం విధిస్తాను. అప్పుడు వారు దానంతట అదే మా బోర్డులో చేరుతారు” అంటూ విలేకరులతో వ్యాఖ్యానించారు.

దావోస్‌లో భేటీకి ప్రతిపాదన: ట్రంప్ షేర్ చేసిన మెసేజ్ ప్రకారం.. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తనను కలవాలని, విందుకు రావాలని మాక్రాన్ కోరారు. ఇరాన్, సిరియా వంటి అంశాలపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, గ్రీన్‌ల్యాండ్ విషయంలో ట్రంప్ ఆలోచనలను మాక్రాన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ రెండు అగ్రదేశాల మధ్య నెలకొన్న ఈ ‘టారిఫ్ వార్’ ప్రపంచ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.