365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 29,2024: బాదంలో ఫైబర్, విటమిన్ “ఇ”, ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా బాదంపప్పును తినడానికి ఇష్టపడని వారుసైతం నీళ్లలో నానబెట్టిన బాదంపప్పుతింటూ ఉంటారు. ఎందుకంటే..? ఆరోగ్యానికి మంచిదని..
బాదంపప్పు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాదంపప్పును నీళ్లలో నానబెట్టడం వల్ల బాదం ఎంతో రుచిగా ఉంటుంది. అటువంటి బాదంపప్పు తినడం వల్ల బరువు తగ్గడానికి, పోషకాలను పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, చర్మాన్ని రక్షించడానికి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.