TSRTC

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 27, 2022: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్ న్యూస్ అందించింది.

ఫెస్టివల్ సందర్భంగా సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. అప్ అండ్ డౌన్ ఒకే సారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

TSRTC

సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని టీఎస్ఆర్టీసీ సంస్థ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

ఈ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. మరిన్ని వివరాలకు www.tsrtconline.in వెబ్ సైట్ ను చూడవచ్చు.