Mon. Jan 13th, 2025

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,జనవరి 12,2025: తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ భక్తులను టీటీడీ జాగ్రత్తగా చూసుకుంటుంది.

నిన్న రాత్రి గాయపడ్డ భక్తులకు పరిహారం అందజేసిన టీటీడీ చైర్మన్ యాదవ్ సుబ్బారెడ్డి, వారికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

చైర్మన్ సూచనల మేరకు ఇవాళ‌ గాయపడ్డ 28 మంది భక్తులకు ప్రోటోకాల్ బ్రేక్ ద్వారా ప్రత్యేక దర్శనం చేయించారు.

గాయపడ్డ భక్తులు మాట్లాడుతూ:
“ప్రభుత్వం, టీటీడీ బోర్డు, అధికారులు మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా చేశారు. అలాగే, వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకంగా అందించడం మాకు ఎంతో ఆనందం కలిగించింది. సీఎం, టీటీడీ బోర్డు, అధికారులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.”

అధికారుల ఆధ్వర్యంలో భక్తులకు మెరుగైన వైద్యం అందించి, తిరిగి వారి గమ్యస్థానాలకు చేరుకునే ఏర్పాట్లు కూడా చేశారు.

“శ్రీవారి ఆశీస్సులతో మేమంతా త్వరగా కోలుకున్నాము” అంటూ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

error: Content is protected !!