365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్,జనవరి 31,2025: జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన భక్తురాలికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు శుక్రవారం పరిహారం అందించారు.
కడప జిల్లా వీరపనాయనపల్లి మండలం సర్వరాజుపేట కాలనీకి చెందిన బాధితురాలైన శ్రీమతి జి. శైలజకు రూ. 2 లక్షల డిడిని అందజేశారు.

తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఈ పరిహారం cheque ను చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, శాంతారాం అందజేశారు.