365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 28,2023: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయానికి వెళ్లే పవిత్ర మార్గంలో చిరుతపులి,ఎలుగుబంటి ఉనికిని ఇటీవలి కెమెరా ట్రాప్ ఫుటేజీలో రికార్డ్ చేయడంతో యాత్రికులకు టీటీడీ దేవస్థానం వారు విజ్ఞప్తి చేశారు.
అలిపిరిలోని శ్రీలక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి తిరుమల కొండకు వెళ్లే నడక మార్గంలోని రిపీటర్ మధ్య ప్రాంతంలో అక్టోబర్ 24 నుంచి 27వ తేదీ మధ్య చిరుతపులి, ఎలుగుబంటి కదలికలు నమోదైనట్లు టీటీడీ వెల్లడించింది.

యాత్రికుల మార్గంలో ఈ వన్యప్రాణుల ఉనికిని గమనించి TTD వారి భద్రత కోసం భక్తులులకు అధిక అప్రమత్తతతో,గుంపులు గుంపులుగా నడక మార్గంలో భక్తులు ట్రెక్కింగ్ చేయవలసిందిగా TTD వారు అభ్యర్థించారు.