365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, డిసెంబర్21,2022: ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందినట్లు ప్రకటించిన డాక్టర్లు.
మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన చంద్రమౌళి.
కర్నూలులో అంత్యక్రియలకు ఏర్పాట్లు.
టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది.
ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మూడు రోజులుగా చెన్నై లోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చేందినట్లు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు.
గత ఆదివారం మధ్యాహ్నం చంద్రమౌళి చెన్నైలో గుండెపోటుకు గురి కావడంతో కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందతూ విషమ పరిస్ధితిలో ఉన్నారు.
అయితే కావేరి ఆసుపత్రి వైద్యులు చంద్రమౌళిని బ్రతికించేందుకు కృషి చేసినప్పటికీ ఆయన అవయవాలు వైద్యంకు సహకరించక పోవడంతో బుధవారం ఉదయం చంద్రమౌళి తుది శ్వాస విడిచారు.
ఇటీవల్ల టిటిడి పాలక మండలి సభ్యులు, చెన్నై పారిశ్రామికవేత్త అయినా ఏజే.శేఖర్ రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం అయ్యింది.
జనవరి 26వ తేదీన వీరి వివాహం తిరుమలలోని శృంగేరి మఠంలో వివాహం జరగాల్సి ఉంది.
అయితే ఇప్పటికే ఇరుకుటుంబాలు వివాహ ఏర్పాట్లల్లో నిమగ్నం అయ్యి, శుభలేఖలను సైతం పంచతున్నారు.
ఈ క్రమంలోనే టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి దంపతులు హైదరాబాదులోని తమ బంధువులకు వివాహ పత్రికలు అందించేందుకు వెళ్ళగా
చంద్రమౌళి చెన్నైలోని ఆళ్వారుపేటలోని బంధువులకు వివాహ పత్రికలు ఇచ్చేందుకు వెళ్ళారు.
అయితే ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం చంద్రమౌళికి గుండెపోటు రావడంతో అతని స్నేహితులు దగ్గర లోని కావేరి ఆసుపత్రి తరలించి చిమిత్స అందించారు.
విషయం తెలుసుకున్న టిటిడి ఈవో దంపతులు హైదరాబాదు నుండి నేరుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో ఉన్న కుమారుడిని చూసి కన్నీ పర్యంతం అయ్యారు.
గత మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
కళ్ళ ముందే కొడుకు మృతి చేందడంతో ధర్మారెడ్డి దంపతులు తీవ్ర శోక సంద్రంలో నిండి పోయారు.
అయితే చంద్రమౌళి పార్ధివ దేహాన్ని కర్నూలు కు తీసుకెళ్ళి ధర్మారెడ్డి సొంత గ్రామంలో అంత్యక్రియలు చేయనున్నారు.