Sat. Dec 7th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 5,2024 : తిరుమల శ్రీవారిని దర్శించుకునే నడకదారి భక్తులకు టీటీడీ శుభవార్త ప్రకటించింది. నడకదారి ద్వారా వచ్చే భక్తులకు రోజూ 10 వేల టికెట్లు జారీ చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. భక్తులు శ్రీవారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు.

ఇప్పటికే, శ్రీవారి మెట్టుమార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకు రోజూ 3 వేల టికెట్లు జారీ చేస్తున్న టీటీడీ, ఇప్పుడు ఆ సంఖ్యను పెంచి నాలుగువేలకు పెంచింది. అలిపిరి మార్గం ద్వారా వచ్చే నడకదారి భక్తులకు ఆరు వేల టికెట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

నడకదారి భక్తులకు టికెట్ల సంఖ్య పెరగడంతో భక్తులలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ డిమాండ్ కొన్నిరోజులుగా వినిపిస్తుండగా, కూటమి అధికారంలోకి రావడంతో టీటీడీలో అధికార మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కొన్నిమార్పులు జరిగాయి. ఈ కొత్త నిర్ణయాలపై భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. https://www.tirumala.org/

ఇది కూడా చదవండి. సనోఫీ ఇండియా సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్ మద్దతుతో RSSDI చేపట్టిన టైప్ 1 డయాబెటిస్ ప్రోగ్రామ్ తో సానుకూల ఫలితాలు..

error: Content is protected !!