
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,మే 26,2022: తిరుమలలో శ్రీవారి సేవకుల కోసం టిటిడి గురువారం నుంచి జీడిపప్పును బద్దలుగా మార్చే సేవను ప్రారంభించింది. శ్రీవారి సేవా సదన్ -2లో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించి ఈ సేవను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీ కోసం టిటిడి సాధారణంగా టెండర్ల ద్వారా జీడిపప్పును కొనుగోలు చేస్తుందన్నారు. జీడిపప్పు బద్దలు తగినంత మొత్తంలో లభించకపోవడంతో మార్చి 21న తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్‌లో శ్రీవారి సేవకులతో జీడిపప్పు బద్దల సేవను ప్రారంభించామని తెలిపారు.
