Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమల,జనవరి 7,2023: తిరుమలలో గదుల అద్దెల ధరలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పెంచి సామాన్యులకు భారంగా మారడంతో తిరుమల భక్తులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.

నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత ధరలను రూ.500, రూ.600 నుంచి రూ.1000కు పెంచినట్లు సమాచారం.నారాయణగిరి రెస్ట్‌హౌస్‌లోని 1,2,3 గదుల ధరలను కూడా అధికారులు రూ.150 నుంచి రూ.1700కు పెంచారు.

రెస్ట్ హౌస్ 4 అద్దె ధరలు రూ.750 నుంచి రూ.1700కి పెరిగాయి. జీఎస్టీతో కలిపి కార్నర్ సూట్ ధర రూ.2200కి పెరిగింది. ప్రత్యేక కాటేజీల గది అద్దెలు రూ.750 నుంచి రూ.2800కి పెంచారు. రూమ్ ల అద్దెలు విపరీతంగా పెరగడంతో సామాన్యులకు భారం కానుంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ..భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తికి టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, 2023 టిటిడి క్యాలెండర్, డైరీని ఈఓ అందజేశారు.

error: Content is protected !!