TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINETTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE
TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE
TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఆగ‌స్టు 6,2021: తిరుమ‌ల శ్రీ‌వారి నైవేద్యాల కోసం ప్ర‌తిరోజు అవ‌స‌ర‌మ‌య్యే నెయ్యి దేశ‌వాళీ ఆవుల పాల నుంచి త‌యారుచేయ‌డానికి త్వ‌ర‌లో ” నవనీత సేవ ” పేరుతో ఓ కొత్త సేవ‌ను ప్రారంభించాలని నిర్ణయించిన‌ట్లు టిటిడి సాధికార మండ‌లి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. సాధికార‌ మండలి సమావేశం శుక్ర‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– శ్రీ‌వారి ఆల‌యంలో నైవేద్యానికి వినియోగించే ప్ర‌సాదాల త‌యారీకి రోజుకు 30 కిలోల దాకా నెయ్యి అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇందుకోసం సుమారు 1200 లీటర్ల పాలు అవసరమవుతాయి. తిరుమ‌ల ఏడు కొండ‌ల‌కు సూచిక‌గా ఏడు దేశ‌వాళీ ర‌కాల ఆవుల‌తోపాటు స్థానికంగా ఉన్న మ‌రో మూడు ర‌కాల దేశవాళీ ఆవుల‌ను క‌లిపి తిరుమ‌లలో 250 నుంచి 300 ఆవుల‌ను ఉంచి పాల ఉత్ప‌త్తికి ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం.

– ఈ కార్య‌క్ర‌మానికి భ‌క్తుల నుంచి దేశ‌వాళీ ఆవుల నుంచి త‌యారు చేసిన‌ స్వచ్ఛమైన నెయ్యిని విరాళంగా తీసుకుంటాం. భ‌క్తులు వారి శ‌క్తి మేర‌కు నెయ్యి విరాళంగా ఇవ్వొచ్చు.

– శ్రీవారి నైవేద్యానికి స్వచ్ఛమైన నెయ్యి త‌యారీకి భ‌క్తులు 25 గిర్ గోవులను విరాళంగా అందించారు.

– గోసంరక్షణపై చిత్తశుద్ధితో పని చేసే కుటుంబాలకు చెందిన వ్య‌క్తులను, నిపుణుల‌ను గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టులో కో-ఆప్ష‌న్ స‌భ్యులుగా నియ‌మిస్తాం.

– టిటిడి అవసరాలకు తగిన విధంగా గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా రాయ‌ల‌సీమ‌ రైతులతో అనుసంధానం చేసుకుని టిటిడికి ప్ర‌తి ఏటా అవ‌స‌ర‌మ‌య్యే ఏడు వేల ట‌న్నుల శ‌న‌గ‌పప్పు కొనుగోలు చేసే అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యం.

TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE
TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE

– తిరుప‌తి ఎస్వీ ప‌శు వైద్య విశ్వ‌విద్యాల‌యం స‌హ‌కారంతో ప‌శువుల దాణా త‌యారీ ప్లాంట్‌, ప‌శువుల సంతాన ఉత్ప‌త్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయు చేసుకోవాల‌ని నిర్ణ‌యం.

– తిరుప‌తి ఎస్వీ గోశాల‌లో ఆర్గానిక్ పద్దతిలో త‌యారు చేసిన అగ‌రుబ‌త్తీల‌ను ఆగ‌స్టు 15వ తేదీ నుంచి తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతాం. అదేవిధంగా కోయంబ‌త్తూరుకు చెందిన ఆశీర్వాద్ సంస్థ ద్వారా 4 నెల‌ల్లోపు పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తులైన స‌బ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీన‌ర్ లాంటి 15 ర‌కాల ఉత్ప‌త్తులను అందుబాటులోకి తీసుకువ‌స్తాం. వీటి త‌యారీకి తిరుప‌తి డిపిడ‌బ్ల్యు స్టోర్‌లోని భ‌వ‌నాల‌ను ఉప‌యోగించుకుంటాం.

– శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.150 కోట్లు విరాళంగా అందింది. శ్రీవాణి ట్రస్టు దాత‌ల‌కు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ప్రాధాన్య‌త ఇవ్వాలని నిర్ణయం.

– టిటిడి ముద్ర‌ణాల‌యంలో ఏటా రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల విలువ‌య్యే ప‌నులు జ‌రుగుతున్నాయి. పిపిపి విధానంలో అధునాత‌న యంత్రాలు ఏర్పాటుచేసి అభివృద్ధి చేయ‌డానికి ఆస‌క్తి క‌లిగిన వారిని ఆహ్వానించేందుకు విధివిధానాలు ఖ‌రారు చేయాల‌ని నిర్ణ‌యం.

– స‌ప్త‌గిరి మాసప‌త్రిక ఎడిటోరియ‌ల్ బోర్డును ఇటీవ‌ల నిష్ణాతులైన పండితుల‌తో ఏర్పాటు చేశాం. త్వ‌ర‌లో మాస‌ప‌త్రికను పుస్త‌క రూపంలో స‌రికొత్త రూపంతో పాఠ‌కులకు అందుబాటులోనికి తీసుకువ‌స్తాం.

TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE
TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE

– తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్‌/పెట్రోల్‌ వాహనాల స్థానంలో విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం. తొలిదశలో ప్రయోగాత్మకంగా 35 విద్యుత్ కార్లను ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌(ఇఇఎస్‌ఎల్‌) ద్వారా నెల‌కు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించి తీసుకోవాల‌ని నిర్ణయం. ఐదేళ్ల త‌రువాత ఈ వాహ‌నాలు టిటిడి సొంత‌మ‌వుతాయి.

– 2022 సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, డీలక్స్‌ డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు ముద్రించేందుకు ఆమోదం.

– టిటిడి పరిపాలనా భవనం, ముద్రణాలయం, రవాణా విభాగంలో సిసిటివి నిఘా ఏర్పాటుకు గాను హైదరాబాద్‌కు చెందిన స్వస్తికా టెక్నాలజీస్‌ సంస్థకు రూ. 2 కోట్లతో టెండర్లు ఖరారు.

– భద్రతా చర్యల్లో భాగంగా 22 బ్యాగేజి స్కానర్ల కొనుగోలుకు రూ.4.27 కోట్లు మంజూరుకు ఆమోదం.

– శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్‌స్వామివారి సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల అభివృద్ధిపనులకు గాను రూ.8.94 కోట్లు టిటిడి ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా చేెపడతారు. ఇందులో చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండ‌లం విఠలం గ్రామంలోని పురాత‌న శ్రీ విఠ‌లేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం రాతి క‌ట్ట‌డం కోసం రూ.6 కోట్ల‌కు పైగా మంజూరు.

– నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలోని శ్రీసీతారామస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి అవసరమైన కోటి రూపాయాలకు గాను రూ.80 లక్షలు శ్రీ‌వాణి ట్ర‌స్టు నుంచి టిటిడి ఆర్థిక సహాయం అందించాల‌ని నిర్ణ‌యం. మిగిలిన రూ.20 లక్షలు స్థానికులు త‌మ వాటాగా అందిస్తారు. ఈ పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా చేెపడతారు.

TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE
TTD ON A DIVINE MISSION TO SAVE DESI BOVINE

– బర్డ్‌ పాత భవనంలో తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న ఎస్వీ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ ద్వారా రెండేళ్ల వారంటీతో రూ.6 కోట్లతో అధునాతన ఫ్లాట్‌ డిటెక్టర్‌ క్యాథ్‌ ల్యాబ్‌ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం.

– అదేవిధంగా, ఈ ఆసుపత్రికిగాను హైదరాబాద్‌కు చెందిన ఆర్కం మెడికల్‌ డివైజెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌
నుంచి రూ.2.30 కోట్లతో 3 హార్ట్‌ లంగ్‌ యంత్రాలు కొనుగోలుకు ఆమోదం.

– టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఉద్యోగులు మ‌రింత మెరుగ్గా విధులు నిర్వ‌హించేందుకు వీలుగా బెంగ‌ళూరుకు చెందిన సంస్థ విరాళ ప్రాతిప‌దిక‌న వ‌ర్క్ స్టేష‌న్లు ఏర్పాటుకు అనుమ‌తి.