Fri. Jan 10th, 2025
TTD | SRI KRISHNA WEARS NEW YAGNOPAVEETAM..
SRI KRISHNA WEARS NEW YAGNOPAVEETAM
SRI KRISHNA WEARS NEW YAGNOPAVEETAM

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమ‌ల‌, 22 ఆగస్టు ,2021: శ్రావణ ఉపకర్మ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి ఆదివారం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. శ్రావణ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ వరాహ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

TTD | SRI KRISHNA WEARS NEW YAGNOPAVEETAM..
TTD | SRI KRISHNA WEARS NEW YAGNOPAVEETAM..

అక్కడ అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నూతన యజ్ఞోపవీతం(పవిత్రమైన దారం) ధరింపజేశారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెంచేపు చేశారు.

error: Content is protected !!