365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,సెప్టెంబరు 27,2021: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా విశ్వనాథ్, కేతన్ దేశాయ్, విద్యాసాగర్ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అదనపు ఈఓ అందించారు.