365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 25, 2022: వడ్డీకాసులవాడు..కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎన్ని ఉన్నాయో లెక్కతేలింది. వాటికి సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది. శ్రీవారికి 14 టన్నుల బంగారం, 14 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానానికి 960 స్థిర ఆస్తులు ఉండగా, వాటి విలువ రూ.85,705 కోట్లు కాగా స్వామివారి పేరుతో 7123 ఎకరాల భూమి ఉందని, టీటీడీకి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.14,000 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లుఉన్నాయని,14 టన్నుల బంగారం ఉందని టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు.
1974 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ట్రస్ట్ బోర్డులు స్వామివారికి చెందిన 113 ఆస్తులను విక్రయించినట్లు ఆయన వెల్లడించారు. 2014 తర్వాత ఇప్పటి వరకు తాము ఎలాంటి ఆస్తులు అమ్మలేదని, టీటీడీకి ఉన్న ఆస్తులు, వాటి విలువలను టీటీడి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు.