365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూలై 23,2022 : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29వ తేదీ శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర ఘనంగా నిర్వహించ నున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం తిరుమల నుంచి శ్రీవారి అప్పాపడి ప్రసాదాన్ని తిరుపతి లోని శ్రీలక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి సాత్తు మొర నిర్వహిస్తారు.
సాత్తుమొర ఎందుకు నిర్వహిస్తారంటే..?
శ్రీప్రతివాది భయంకర అన్నన్ కాంచిపురంలో జన్మించారు. ఆయన సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతాన్ని, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. అంతేగాక శ్రీభాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్నిపురస్కరించు కుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.