Fri. Dec 13th, 2024
TTD kalyanamastu
TTD kalyanamastu

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమల,జూన్11,2022: టీటీడీ పదేళ్ల విరామం తర్వాత ఆగస్టు 7న రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచిత సామూహిక కళ్యాణమస్తు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈవిషయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మం, టీటీడీ ఆధ్వర్యంలో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తా మని ఆయన చెప్పారు. అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగు వారి కోసం జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.

TTD kalyanamastu

గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించా లని నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసభారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించ బోతున్నామన్నారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ చెప్పారు.

జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు జరుగుతాయన్నారు. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

error: Content is protected !!