Sat. Nov 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్ర‌వ‌రి 21,2022: శ్రీనివాసమంగా పురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.

స్నపన తిరుమంజనం :

అనంతరం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్స‌వ‌ర్ల‌కు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

error: Content is protected !!