Fri. Dec 13th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్ర‌వ‌రి 21,2022: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై అనుగ్ర‌హించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు హంసగా మారి తన దివ్య తత్వాన్ని వెల్లడించారు. హంస సరస్వతిదేవికి వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతి రూపంలో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య గుణానికి నిదర్శనం.

error: Content is protected !!