365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, జూలై 15, 2024: ద్వి చక్ర, మూడు చక్రాల వాహన విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ గ్లోబల్ ఆటోమేకర్, టీవీఎస్ మోటర్ కంపెనీ (TVSM) ఈ రోజు తెలంగాణలో టీవీఎస్ అపాచీ 160 సిరీస్ మోటర్‌సైకిళ్లలో ‘A Blaze of Black’ డార్క్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది.
ఇవి టీవీఎస్ అపాచీ RTR 160 అండ్ RTR 160 4V గా లభిస్తాయి. అపాచీ RTR 160 4V అనేది భారతదేశపు అత్యంత శక్తివంతమైన 160cc ఆయిల్ కూల్డ్ మోటర్‌సైకిల్, ఇది 17.6 PS @ 9250 శక్తిని విడుదల చేస్తుంది. మూడు రైడ్ మోడ్‌లు, డిజిటల్ ఎల్ సి డి క్లస్టర్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ అండ్ టెయిల్‌ల్యాంప్, జిటిటి తో సహా తమ విభాగం లో అత్యుత్తమ పనితీరు లక్షణాలతో ఈ రెండు మోటర్‌సైకిళ్లు వస్తాయి.
ఈ విభాగం మొదటి రైడ్ మోడ్‌లు ఇంజిన్ అండ్ ఏబీఎస్ మోడ్‌ల కలయికతో 3 మోడ్ లు – స్పోర్ట్, అర్బన్ అండ్ రైన్ లను అందిస్తాయి. ఇవి విభిన్న రైడింగ్ వాతావరణాల కోసం రూపొందించబడ్డాయి. 60కి పైగా దేశాల్లో బలమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీవీఎస్ అపాచీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ మోటర్‌సైకిల్ బ్రాండ్‌గా అవతరించింది. www.tvsmotor.com
టీవీఎస్ రేసింగ్ డీఎన్ఏ నుండి పుట్టిన ఈ సిరీస్ దాని పనితీరు, ప్రత్యేకమైన డిజైన్, సాంకేతికత నుంచి ఇంజినీరింగ్ వరకు రైడర్ తో అనుబంధం , భద్రత అండ్ సౌకర్యాలపై దృష్టి సారిస్తుంది. ట్రాక్ టు రోడ్ ఫిలాసఫీ చుట్టూ ఇది నిర్మించబడటంతో పాటుగా అభివృద్ధి చేశారు. టీవీఎస్ అపాచీ సిరీస్ రేసింగ్‌ను ప్రజాస్వామ్యం చేయడంలో సహాయపడింది. కేవలం ఒక ఉత్పత్తి అని కాకుండా అత్యంత ఆశావహమైన మోటర్‌సైకిల్ బ్రాండ్‌గా ఇది అభివృద్ధి చెందింది.
టీవీఎస్ మోటర్ కంపెనీ, ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ మాట్లాడుతూ, “నాలుగు దశాబ్దాల సుసంపన్నమైన రేసింగ్ వారసత్వంతో రూపుదిద్దుకున్న టీవీఎస్ అపాచీ సిరీస్ 5.5 మిలియన్లకు పైగా ఔత్సాహికుల ప్రపంచ కమ్యూనిటీగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం మోటర్‌సైకిల్ బ్రాండ్‌లలో ఒకటి. www.tvsmotor.com
దాని మెరుగైన పనితీరును ప్రదర్శిస్తూ, టీవీఎస్ అపాచీ సిరీస్ అత్యాధునిక సాంకేతికతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పుడు, టీవీఎస్ అపాచీ RTR160 సిరీస్ ఆకర్షణీయమైన కొత్త బ్లాక్ ఎడిషన్‌తో, ఇది మా కస్టమర్‌లను బోల్డ్ , స్పోర్టియర్ లుక్‌తో ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది…” అని అన్నారు.
దాని మెరిసే నల్లటి ఫినిష్, పూర్తిగా కొత్త రూపుతో, బైక్ నిర్భయమైన, ఎదురులేని స్ఫూర్తిని వెదజల్లుతుంది, అది మిగిలిన వాటి నుంచి వేరుగా ఉంటుంది. దాని ట్యాంక్‌పై నలుపు రంగు టీవీఎస్ లోగోతో కూడిన మినిమల్ గ్రాఫిక్స్ డిజైన్ ,బ్లాక్డ్ అవుట్ ఎగ్జాస్ట్, ఈ అద్భుతమైన మెషీన్ సౌందర్య ఆకర్షణను మరింత మెరుగు పరుస్తుంది.
టీవీఎస్అపాచీ RTR 160 4V ఫీచర్స్..
- ఈ విభాగంలో అత్యధిక శక్తి 17.6 PS
- అత్యధిక పవర్ టు వెయిట్ నిష్పత్తి
- 3 రైడ్ మోడ్‌లు
- DRL తో LED హెడ్‌ల్యాంప్
టీవీఎస్అపాచీ RTR 160 ముఖ్య ఆకర్షణలు - 3 రైడ్ మోడ్‌లు – వర్షం, అర్బన్ అండ్ స్పోర్ట్
- LED హెడ్‌ల్యాంప్..
బ్లాక్ ఎడిషన్ – టీవీఎస్అపాచీ RTR 160 సిరీస్ వాహనాలలో టీవీఎస్అపాచీ RTR 160 రూ.1,09,990 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) టీవీఎస్అపాచీ RTR 160 4V రూ.1,19,990 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్) ధరలో అందుబాటులో ఉంటాయి. www.tvsmotor.com