Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ఆగస్టు 9, 2023: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ కి రెండు పండుగలు కలిసి వచ్చాయి. ఒక పండుగ ఆయన బర్త్ డే కాగా, మరొకపండుగ మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించనున్న “గుంటూరు కారం” సినిమా పోస్టర్ రికేజ్. ఇప్పుడీ రెండు పండుగలను కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

సినిమాలో మాస్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది.

ఇవాళ సూపర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా “గుంటూరుకారం” పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్ బాబు సరికొత్తగా కనిపిస్తున్నాడు. మాస్ లుక్ లో సిగరెట్ వెలిగిస్తూవచ్చిన మహేష్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. మహేష్ బాబు మాస్ పాత్రలో నటించడంతో ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా ఒక కథానాయికగా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంగీత దర్శకుడిగా థమన్‌ని ఎంచుకున్నాడు.

మరో కీలకమైన అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగానే విడుదలకానుంది. 12 జనవరి 2024న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఎటువంటి సందేహం లేకుండా, గుంటూరు కారం ఓవర్సీస్తోపాటు దేశీయ మార్కెట్‌లలో బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని అంచనావేస్తున్నారు.

error: Content is protected !!