365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,పల్నాడు,డిసెంబర్ 4,2022:పల్నాడు రొంపిచెర్ల సమీపంలో లారీ,కారు ఢీకొనడంతో ఆదివారం తెల్లవారుజామున నార్కెట్‌పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కనిగిరి పట్టణానికి చెందిన మల్లికార్జునరావు, ప్రసాద్‌లుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.