
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్, తిరుపతి 23, 2021: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా పోకల అశోక్‌కుమార్,కె.సంజీవయ్య గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు.

శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అదనపు ఈఓ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ ఇరువురు బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్వో గోపినాథ్ జెట్టి, డిప్యూటీ ఈవోలు రమేష్ బాబు, సుధారాణి,లోకనాథం, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.