365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 1,2023: కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 వద్ద కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు.
తెల్లవారుజామున 5.30 గంటలకు యువకుల బృందం ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణంగా డ్రైవర్ బ్రేక్ పడకపోవడంతో కారు పాదచారుల పైకి దూసుకువచ్చింది. దీంతో ఈ ప్రమదం జరిగింది .
ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంత మందికి గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మృతుల మృతదేహాలను మార్చురీకి తరలించారు.
కేసు బుక్ చేయబడింది. కారు డ్రైవర్, ఇతర ప్రయాణికులు ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఉన్నారు అని పోలీసులు తెలిపారు.