365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జమ్మూకశ్మీర్, సెప్టెంబర్ 6,2022: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.
“ఇద్దరు ఉగ్రవాదులు ఎవరు అని శోధన జరుగుతుందాని పోలీసులు తెలిపారు .అనంత్‌నాగ్‌లోని పోష్‌కీరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాల సంయుక్త బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుము ట్టిన తర్వాత అక్కడ కాల్పులు ప్రారంభమయ్యాయి.

దీంతో అక్కడ దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపుతూ కాల్పులు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా కాశ్మీర్ అంతటా ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య వరుస ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి, ఇందులో చాలా మంది ఉగ్రవాదులు,వారి కమాండర్లు చనిపోయారు …