365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, బెంగళూరు,జనవరి 7,2023: బెంగళూరులోని కేఆర్‌పురం ప్రాంతంలో వేగంగా వస్తున్న ఆటోను కారు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.మృతి చెందిన ఇద్దరు మహిళలను ఫాజిలా, తసీనాగా గుర్తించారు.

ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, తసీనా భర్త ఖలీద్‌కు గాయాలయ్యాయి.క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు.
కె.ఆర్. పురం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.