365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూన్ 27,2022: విమెన్ఎ నర్జీ సంస్థ , తెలంగాణ సూక్ష్మ , చిన్న, మధ్య తరాహాపరిశ్రమ శాఖ సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమ సంస్థతో కలిసి అంతర్జాతీయ ఎం.ఎస్.ఎం దినోత్సవం వేడుకలు బాలానగర్ లోని ఎం.ఎస్.ఎం కార్యాలయం లోనిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ లోని హైదరాబాద్, వరంగల్, నల్గొండ, రంగా రెడ్డి జిల్లాల నుంచి దాదాపు మూడు వందల మంది మహిళలు స్వయం ఉపాధి లో భాగంగా వారికి నూతన సంస్థల స్థాపన కోసం నమోదు కార్యక్రమం ‘ఉద్యమ్ డ్రైవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎం ఎస్ ఎం ఈ అడిషనల్ డెవెలప్మెంట్ ఆఫీసర్ డి.చంద్రశేఖర్ హాజరయ్యారు.
బహుళ వ్యాపారవేత్త , విమెన్ ఎనర్జీ సంస్థ స్థాపకురాలు దీప్తి రెడ్డి మాడుగుల 2015 నుంచి దాదాపుపదివేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలకు తన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
దీప్తి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో గ్రామీణ స్థాయి నుంచి మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించాలని, ఎం.ఎస్.ఎం.ఈ శాఖ గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళలకు నైపుణ్యాలు పెంపొందించడమే కాకుండా ఆర్థిక వనరులను సమకూర్చా లని కోరుతూ, షీ మాన్యుఫ్యాక్చెర్స్ పేరిట విమెన్ ఎనర్జీ సంస్థ త్వరలోనే విమెన్ కో ఆపరేటివ్ సొసైటీ లు, ఇంకుబెటర్స్ ను ప్రతి జిల్లాలోను నెలకొల్పుతుందని, ఔత్సాహిక మహిళలు తమని సంప్రదించవచ్చని , నెట్వర్క్ అఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటి ఆర్గనైజేషన్ తో కలిసి దివ్యంగా మహిళ వ్యాపారవేత్తలను తయారు చేబోతున్నామని తెలిపారు.
ఎంఎస్ఎంఈ ఇన్స్టిట్యూట్ అడిషనల్ డెవెలప్మెంట్ ఆఫీసర్ డి.చంద్రశేఖర మాట్లాడుతూ ప్రతి మహిళకు ఎం ఎస్ ఎం ఈ తరపున వ్యాపారాలు నెలకొల్పడానికి సహకరిస్తామని, దివ్యంగా మహిళలకు కూడా ముద్ర లోన్స్ అందించి వ్యాపారవే త్తలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో క్రాంతి జ్యోతి ఫౌండేషన్ రజనీ , గ్రీన్ మారో ఎంటర్‌ప్రైజెస్ ఉమా, ఏక్ నయీ దిశా ఫౌండేషన్ జ్యోతి , ఎన్.పి.డీ. ఓ.కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు.*