365తెలుగు డాట్ కామ్ ఆన్ ఇన్ న్యూస్, సైబరాబాద్, మే 26, 2025: వేసవి సీజన్‌కి సరైన సందడిగా, ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ మామిడి ప్రేమికుల కోసం ఒక ప్రత్యేక మామిడి పండుగను తీసుకువస్తోంది! థింగ్స్ టు డూ హైదరాబాద్‌ తో కలిసి ఈ వేసవిని మరింత రుచికరంగా మార్చే “జో చాహే మ్యాంగో” ఉత్సవాన్ని 2025 మే 23 నుంచి 25 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

“జో చాహే మ్యాంగో” ఉత్సవం భారతదేశపు ప్రియమైన పండు మామిడి సుమధురతను ప్రతిబింబించే వేడుక. నోటిలో కరిగే రకాల రుచుల నుంచి సృజనాత్మక వర్క్‌షాప్‌లు, లైవ్ మ్యూజిక్, ప్రత్యేక ఫ్లీ మార్కెట్ వరకు ఈ మూడు రోజుల వేడుకలో ప్రతి ఒక్కరికీ ఆనందం కోసం ఏదో ఒకటి ఉంటుంది.

ఇది కూడా చదవండి…శరత్ సిటీ మాల్‌లో వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్: హీరోయిన్ ధన్య బాలకృష్ణ సందడి

ఇది కూడా చదవండి…గుజరాత్ పర్యటనలో ప్రధాన మంత్రి మోడీ.. రూ.77,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఈ వేడుకలో మీరు ఆస్వాదించగలవు:

మామిడి రుచుల విందు – మామిడి చీజ్‌కేక్, తాజా ఆమ్ రాస్ వంటి ఎన్నో రకాల మామిడి ఆధారిత డెజర్ట్‌లను ఆస్వాదించండి.

టోట్ బ్యాగ్ పెయింటింగ్ – మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ వేసవి నేపథ్యంతో టోట్ బ్యాగ్‌ను స్వయంగా రూపొందించుకోండి.

మ్యాంగో కేక్ క్యాండిల్ వర్క్‌షాప్ – రుచికరమైన మ్యాంగో కేక్‌లా కనిపించే సుగంధిత కొవ్వొత్తులు తయారు చేయడం నేర్చుకోండి.

ఫేస్ ఆర్ట్ & టాటూలు – చిన్నారుల నుండి పెద్దవారికి అందరికి సరిపోయే రంగుల డిజైన్లు, తాత్కాలిక టాటూలతో సరదాగా గడపండి.

లైవ్ మ్యూజిక్ – వేసవిలో ఉల్లాసాన్ని పంచే లైవ్ సంగీత ప్రదర్శనలు ఆస్వాదించండి.
ఫ్లీ మార్కెట్ – చేతితో తయారైన ప్రత్యేక వస్తువులు, ఉపకరణాలు, గిఫ్ట్ ఐటెమ్స్ తో ప్రత్యేక షాపింగ్ అనుభవం పొందండి.

Read This also…Eesha Rebba Brings Star Power to Viindya Gold..

ఇది కూడా చదవండి…ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌లో కొత్త అధ్యాయం : హార్మొనీ డైరెక్ట్ 2.0ను విడుదల చేసిన ఎక్సికామ్

మామిడి ప్రియులు లేదా వారాంతాన్ని సరదాగా గడపాలనుకునేవారెవరు కావాలన్నా, ఈ వేసవిలో ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం!

మేము మీరు అందరినీ “జో చాహే మ్యాంగో” ఉత్సవానికి ఆహ్వానిస్తున్నాము..