365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 29, 2025: ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో యూరప్‌వ్యాప్తంగా విజయవంతంగా ఉత్పత్తులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అల్ట్రావయొలెట్ ఇటు భారతంలో కూడా కార్యకలాపాలను మరింతగా విస్తరించే దిశగా హైదరాబాద్‌లో అధునాతన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఆవిష్కరించింది.
భారతంలో అల్ట్రావయొలెట్ వృద్ధి ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా పనితీరు ఆధారిత, పర్యావరణహితమైన విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందుబాటులోకి తేవడంపై కంపెనీకి గల నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.
సన్‌రైజ్ మోటోహైవ్ (Sunrise Motohive LLP) డీలరు భాగస్వామ్యంతో కొత్తగా నెలకొల్పిన యూవీ స్పేస్ స్టేషన్ అనేది అల్ట్రావయొలెట్ పర్ఫార్మెన్స్ మోటర్‌సైకిల్స్ – F77 మాక్2, F77 సూపర్‌స్ట్రీట్ గురించి తెలుసుకునేందుకు, అనుభూతి చెందేందుకు తోడ్పడుతుంది. యూవీ స్పేస్ స్టేషన్ 3S ఫెసిలిటీగా ఉంటుంది.
టెస్ట్ రైడ్ అనుభూతితో మొదలుపెట్టి సేల్స్, సర్వీస్, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, విస్తృతమైన మోటర్‌సైకిల్ యాక్సెసరీల శ్రేణి వరకు అన్నింటినీ ఒకే చోట అందించే విధంగా ఇది డిజైన్ చేయబడింది.
ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో పర్ఫార్మెన్స్ మోటర్‌సైకిల్స్ అయిన F77 మాక్2 మరియు F77 సూపర్‌స్ట్రీట్ డిస్‌ప్లే చేయబడతాయి.
40.2 hp పవర్‌ట్రైన్, 100 Nm టార్క్ దన్నుతో కేవలం 2.8 సెకన్లలోనే 0 నుంచి గంటకు 60 కి.మీ. వేగాన్ని అందుకునే అత్యంత సమర్ధవంతమైన వాహనాలుగా ఇవి తీర్చిదిద్దబడ్డాయి. 10.3kWh బ్యాటరీ దన్నుతో ఒక్కసారి చార్జి చేస్తే 323 కి.మీ. IDC రేంజినిస్తాయి.

“హైదరాబాద్‌లో మా రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమనేది కేవలం కార్యకలాపాల విస్తరణకే కాకుండా దేశంలోనే అత్యంత డైనమిక్ ఈవీ కమ్యూనిటీల్లో ఒకటైన ఇక్కడి వారి నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ, వారితో పాటే ఎదిగేందుకు తోడ్పడనుంది.
ఇక్కడి నగర వాసుల్లో పురోగామి ఆలోచనా విధానం, కొత్త ఆవిష్కరణలపై ఉత్సుకత గణనీయంగా కనిపిస్తుంది. పనితీరు, ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన ఇంజినీరింగ్‌కి విలువనిచ్చే వారితో కలిసి పని చేయడానికి ఇక్కడ ఎంతో అనువైన వాతావరణం ఉంటుంది.
పనితీరు, డిజైన్ సరిహద్దులను చెరిపివేస్తూ ముందుకు దూసుకెళ్తూనే కస్టమర్లలోనూ మాపై నమ్మకాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా ఈ సెంటర్ ప్రారంభించడం ఓ కీలక ముందడుగుగా నిలుస్తుంది” అని అల్ట్రావయొలెట్ సీటీవో & సహ-వ్యవస్థాపకుడు నీరజ్ రాజ్‌మోహన్ (Niraj Rajmohan) తెలిపారు.
కాలానుగుణంగా తమ ఉత్పత్తులను నిరంతరం సరికొత్తగా తీర్చిదిద్దుకుంటూ పరిమితుల హద్దులను చెరిపివేస్తూ, అల్ట్రావయొలెట్ ముందుకు సాగుతోంది.
కొత్త ఆవిష్కరణలతో ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిణామక్రమాన్ని పునర్నిర్వచిస్తూ, పనితీరును మరింతగా మెరుగుపర్చే “జెన్3 పవర్‌ట్రైన్ ఫర్మ్‌వేర్” మరియు ‘బాలిస్టిక్+’ అనేవి గత F77లతో పాటు కొత్త కస్టమర్లకు కూడా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులోకి తెచ్చింది.
F77లు ఇప్పుడు మరింత వేగవంతమైన రెస్పాన్స్, యాక్సెలరేషన్, ఇనీషియల్ సర్జ్‌ను అందిస్తాయి. 2024లో తొలి దశలో F77లలో ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (UVDSC), 10 స్థాయుల రీజెనరేటివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, వయొలెట్ A.I. లాంటి అనేక భద్రత ఫీచర్లపై ప్రధానంగా దృష్టి పెట్టబడింది.
ఈ ఏడాది తొలినాళ్లలో అల్ట్రావయొలెట్ ప్రవేశపెట్టిన రెండు కొత్త ఉత్పత్తులకు కూడా విశేష స్పందన లభించింది. ఆమ్నిసెన్స్ మిర్రర్స్‌తో పాటు సెగ్మెంట్‌లోనే తొలిసారిగా సమగ్ర రాడార్, డ్యాష్‌క్యామ్ కలిగి ఉండి, ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘టెసెరాక్ట్’ (‘Tesseract’), ఉత్తేజభరితమైన రైడింగ్ అనుభూతిని కోరుకునే రైడర్ల డిమాండ్లను తీర్చే విధంగా, చాలా నిశితంగా తీర్చిదిద్దిన సంచలనాత్మక ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ ‘షాక్‌వేవ్’ (‘Shockwave’) వీటిలో ఉన్నాయి.
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో యూవీ స్పేస్ స్టేషన్ చిరునామా: సాయి నగర్ రోడ్, రాక్ టౌన్ రెసిడెంట్స్ కాలనీ, ఎల్‌బీ నగర్, హైదరాబాద్-500068.