365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ ,ఏప్రిల్3,2023:కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం అధిక నిరుద్యోగిత సమస్యను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో నిరుద్యోగిత రేటు 7.7 శాతానికి పెరిగింది. నిరుద్యోగిత రేటు పట్టణ ప్రాంతాల్లో 8.4 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 7.4 శాతానికి పెరిగింది.
ఈ ఆర్ధిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉన్నప్పటికీ, నిరుద్యోగిత రేటు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇది నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేసే ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతుంది.
CMIE డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి నెలలో జాతీయ స్థాయిలో నిరుద్యోగ రేటు 7.14 శాతం ఉంది. ఫిబ్రవరిలో 7.45 శాతం ఉండగా, మార్చిలో రికార్డు స్థాయిలో 7.80 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నెలలో ఈ రేటులో పాక్షిక తగ్గింది. ఇప్పుడు అది 7.70 శాతంగా ఉంది.
కానీ ఏప్రిల్ నెలలో వ్యాపార కార్యకలాపాలు పుంజుకున్నప్పుటికీ, నిరుద్యోగిత రేటు కూడా కాస్త మార్పురావచ్చని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.