Private Limited Union AMC announces the launch of Union Hybrid Equity Fund.Private Limited Union AMC announces the launch of Union Hybrid Equity Fund.

365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ముంబై, 23 నవంబర్‌ 2020 ః యూనియన్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ (ద స్కీమ్‌)ను ఆవిష్కరిస్తున్నట్లు యూనియన్‌ ఏఎంసీ వెల్లడించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ హైబ్రిడ్‌ పథకం. ఈక్విటీ సంబంధిత ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ప్రధానంగా పెట్టుబడులు పెడుతుంది. ఈ పథకం కనీసం 65%ను ఈక్విటీ,గరిష్టంగా డెబ్ట్‌లో 35% పెట్టుబడులు పెడుతుంది. ఈనూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ)పథకం 27 నవంబర్‌ 2020న తెరువబడుతుంది మరియు 11 డిసెంబర్‌ 2020వ తేదీన మూయబడుతుంది. కేటాయింపులు డిసెంబర్‌ 18,2020వ తేదీన జరుగనున్నాయి,నిరంతర అమ్మకాలు,పునః కొనుగోళ్లు 28 డిసెంబర్‌ 2020వ తేదీ నుంచి ఆరంభమవుతాయి.క్రిసిల్‌ హైబ్రిడ్‌ 35+65 యాగ్రెసివ్‌ ఇండెక్స్‌ (టీఆర్‌ఐ)కు అనుగుణంగా ఈ పథకం బెంచ్‌మార్క్‌ చేయబడింది. దీనిని శ్రీ వినయ్‌ పచారియా,పరిజిత్‌ అగర్వాల్.‌ హార్దిక్‌ బోరా నిర్వహించనున్నారు. ఈ పథకంలో కనీస పెట్టుబడి 5వేల రూపాయలు ఆపైన ఒక రూపాయి గుణిజాలుగా ఉంటుంది.

Private Limited Union AMC announces the launch of Union Hybrid Equity Fund.
Private Limited Union AMC announces the launch of Union Hybrid Equity Fund.

ప్రదీప్‌ కుమార్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో), యునియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ఇతర అంశాలతో పాటు, వివేకవంతమైన ఆస్తుల కేటాయింపులు విజయవంతమైన పెట్టుబడుల ఫలితాలకు మూలంగా ఉంటాయి. విభిన్నమైన ఎస్సెట్‌ క్లాసెస్‌ సాధారణంగా సమానంగా ఉండవు. అందువల్ల, ఈక్విటీ డెబ్ట్‌ సమ్మేళనంగా ఉండే యూనియన్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌, తమ ఆస్తుల కేటాయింపు పరంగా సమతుల్యతను పాటించాలనుకునే మదుపరులకు చక్కటి ఎంపికగా నిలుస్తుంది. ఈ విభాగంలో అనుమతించిన పరిమితులలో ఈక్విటీ డెబ్ట్‌ యొక్క న్యాయమైన మిశ్రమాన్ని నిర్వహించడానికి ఈ పథకం ప్రయత్నిస్తుంది. ఈ పథకపు పోర్ట్‌ఫోలియోలోని అన్ని పెట్టుబడుల నిర్ణయాలనూ మా బలీయమైన పెట్టుబడి ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశనం చేయబడుతుంది’’ అని అన్నారు.