Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 1,2024:ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించారు. ఈ బడ్జెట్ మధ్యంతరమైనది ,చాలా మందికి దీని నుంచి అంచనాలు లేవు.

కానీ ఎన్నికల సంవత్సరం దృష్ట్యా, ఈ సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌లో కూడా మహిళలు, మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారుల కోసం అనేక పెద్ద ప్రకటనలు చేసింది.

మధ్యంతర బడ్జెట్‌లో వివిధ వర్గాలకు ప్రభుత్వం ఏం ఇచ్చిందో సరళమైన భాషలో అర్థం చేసుకుందాం.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం
ఈ పథకం కింద మూడు కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

వీటిలో వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్లు నిర్మించనున్నారు. ఈ విధంగా దేశంలోని గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది.

ప్రభుత్వం బడ్జెట్‌లో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ పథకాన్ని ప్రకటించింది. దీని కింద కోటి ఇళ్లకు సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పొందే అవకాశం ఉంటుంది. రూ.15-18 వేలు ఆదా అవుతుంది.

error: Content is protected !!