365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,అక్టోబర్ 31,2022: అంతర్జాతీయంగా గ్యాస్, ఆయిల్, ఎనర్జీ రంగాల్లో ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంలో అబుదాబిలో నాలుగురోజుల పాటు జరుగుతున్న ప్రతిష్టాత్మక అడిపెక్ ఎగ్జిబిషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రభుత్వరంగ సంస్థ అయిన ఏపీఎండీసీ పాల్గొంది.
సోమవారం నుంచి గురువారం వరకు జరిగే ఈ ఎగ్జిబీషన్ లో అంతర్జాతీయంగా 28 దేశాల నుంచి 2200 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు 80 శాతం బెరైటీస్ ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్న అతిపెద్ద ఖనిజరంగ సంస్థగా ఎపిఎండిసి ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఎపిఎండిసి ఏర్పాటు చేసిన స్టాల్ ను భారత కేంద్ర పెట్రోలియం & సహజావాయువు శాఖ మంత్రి హర్ దీఫ్ సింగ్ పూరి ప్రారంభించారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో 6కాన్ఫెరెన్స్ లు,133 టెక్నికల్ సెక్షన్స్ జరుగుతాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బెరైటీస్ ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో ఒకటైన ఎపిఎండిసి ఏర్పాటు చేసిన స్టాల్ ను పలు దేశాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఆస్తకిగా సందర్శించడం విశేషం. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎపిఎండిసి ఉత్పత్తి చేస్తున్న బెరైటీస్ కు అంతర్జాతీయంగా మరింత మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడతాయి.
పలు దేశాల నుంచి వచ్చిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఎపిఎండిసితో వ్యాపార భాగస్వామ్యం కోసం ముందుకు వస్తున్నారు. తొలిరోజు ప్రముఖ కంపెనీలు సౌదీ ఆరామ్ కో, ఎగ్జిబిషన్ స్టాల్ ను సందర్శించిన కంపెనీల్లో సౌదీ ఆరామ్ కో, సిఎస్ఎల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సంస్థల ప్రతినిధులు ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు.
ఎపిఎండిసితో వ్యాపార కార్యకలాపాలపై ఆయా కంపెనీల ప్రతినిధులు చర్చలు జరిపారు. అడిపెక్ ఎగ్జిబిషన్ లో విసి&ఎండి తో పాటు జనరల్ మేనేజర్లు టి.నతానేయల్, ఆళ్ళ నాగేశ్వరరెడ్డి, డిజిఎం విగ్నేశ్ రెడ్డి హాజరయ్యారు.