Mon. Dec 23rd, 2024
nirmala-sitaraman-visits-tirumala

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, తిరుమల, అక్టోబర్ 20, 2022: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిశ్రీమతి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం విఐపి బ్రేక్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న కేంద్ర మంత్రికి టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ‌ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.

nirmala-sitaraman-visits-tirumala

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ కు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీటేబుల్ బుక్ అంద‌జేశారు.

 ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపి డాక్టర్ గురుమూర్తి, టిటిడి మాజీ బోర్డు స‌భ్యులు భానుప్ర‌కాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!