365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై,జూలై 16,2021 : బజాజ్ సంస్థ భారతదేశంలో 1990 తర్వాత బజాజ్ కాలిబర్ 115 మోడల్ చాలా ప్రత్యేకత స్థానాన్ని దక్కించుకుంది. ఈ బైక్‌లో బజాజ్, కవాసకి సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన 111.6సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9.5 బిహెచ్‌పి పవర్‌ను,9.10 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తున్నది. ఈ ఇంజన్‌తో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండేది. కాగా, బజాజ్ ఆటో ధరఖాస్తు చేసుకున్న ట్రేడ్‌మార్క్ అప్లికేషన్ ప్రకారం, ‘బజాజ్ కాలిబర్’ నేమ్‌ప్లేట్‌ను ద్విచక్ర వాహనం, త్రీ-వీలర్ లేదా విద్యుత్ శక్తితో కూడిన ద్విచక్ర వాహనం (ఎలక్ట్రిక్ టూవీలర్) కోసం ఉపయోగించవచ్చు. అయితే, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, బజాజ్ కాలిబర్‌ను ఎంట్రీ లెవల్ ఐసి (ఇంటర్నల్ కంబస్టియన్) ఇంజన్ పవర్డ్ కమ్యూటర్ బైక్‌గా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, కొత్త బజాజ్ కాలిబర్ మోటార్‌సైకిల్‌లో బజాజ్ ప్లాటినా 110లో ఉపయోగించిన 115సిసి ఇంజన్‌ను కానీ లేదా పల్సర్ 125 మోడల్‌లో ఉపయోగించిన 125సిసి ఇంజన్‌ను కానీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇందులో ప్లాటినాలోని 115సిసి, ఎఫ్‌ఐ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 8.5 బిహెచ్‌పి శక్తిని, 9.81 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, పల్సర్ 125లోని 124సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ 12 బిహెచ్‌పి పవర్‌ను,11 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.
బజాజ్ ఆటో , కవాసకి సంస్థలు 1990 కాలంలో భాగస్వాములుగా ఉండేవి. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యం తో మార్కెట్లోకి అనేక రకాల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిలో అత్యంత పాపులర్ అయింది. ఈ బైక్ ను “బజాజ్ కాలిబర్” అని “కవాసకి కాలిబర్”అని రెండు పేర్లతో పిలిచేవాళ్ళు.బజాజ్ ఆటో 1998లో కాలిబర్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ సమయంలో ఇది యువతను చాలా బాగా ఆకట్టుకుంది. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన ‘హుడిబాబా’ ప్రకటనలు ఈ మోడల్ అమ్మకాలపై గొప్ప ప్రభావాన్ని చూపాయి.
హుడిబాబా బైక్ గుర్తుందా..?
ఈ జనరేషన్ వాళ్లకు దీని గురించితెలియకపోవచ్చు కానీ..1990 లో యూత్ కు మాత్రం “బజాజ్ కాలిబర్” అంటే మంచి క్రేజ్ ఉండేది.. అప్పట్లో టెలివిజన్ ,రేడియోల్లో ఈ యాడ్ మారుమోగిపోయేది. టీవీల్లో హుడిబాబా అడ్వర్టైజ్‌మెంట్ చూస్తే వింత అనుభూతి కలిగేది.ఒకప్పటి కుర్రకారుకి బజాజ్ కాలిబర్ బైక్ ఇప్పటి ప్రీమియం బైక్‌లతో సమానం. ఆ స్థాయిలో ఉండేది మరి. గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్, లీటరు పెట్రోల్‌కి 90 కిలోమీటర్ల మైలేజ్, 115సీసీ ఇంజన్ ,9.5 బిహెచ్‌పి పవర్.. ఇవన్నీ బజాజ్ కాలిబర్ మోటార్‌సైకిల్ ప్రత్యేకతలు.