Sat. Nov 16th, 2024
chinthamani-movie

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,15,జూన్,2022: చింతామణి సినిమా… కాళ్ళకూరి నారాయణ రావు ప్రసిద్ధ నాటకం ఆధారంగా భరణి స్టూడియోస్ నిర్మించిన చిత్రం చింతామణి . పి. రామకృష్ణారావు ఈ చిత్రానికి నిర్మాతగానేకాక స్క్రీన్ ప్లే, దర్శకత్వం తో పాటు ఎడిటర్ గా పని చేశారు. ఈ చిత్రానికి అద్దేపల్లి రామారావు, సంగీత నృత్యాలకు టి.వి.రాజు సంయుక్తం గా సంగీతం అందించారు, ఎన్టీఆర్,ఎస్వీఆర్, రేలంగి, రఘురామయ్య, భానుమతి, జమున , ఋషేంద్రమణి , ప్రభావతి తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం 11 ఏప్రిల్ 1956 లో విడుదల అయి యావరేజ్ సినిమా గా నిలిచింది.

chinthamani-movie

వేశ్య కుటుంబంలో పుట్టిన చింతామణి ( భానుమతి ) కృష్ణ భక్తురాలు, అమ్మ శ్రీహరి ( ఋషేంద్రమణి ) బలవంతం తో సానివృత్తి లోకి వస్తుంది, శ్రీ కృష్ణుడు( రఘురామయ్య) , రుక్మిణి ( ప్రభావతి) తో కలసి చింతామణిని, మరి కొందరిని పరీక్షించాడని ఒక సాధువుల భూమి మీదకు వస్తాడు. భవాని శంకరం ( ఎస్వీఆర్) ఒక బ్రాహ్మణ యువకుడు, చింతామణి వ్యామోహం తో సర్వం పోగొట్టుకొని బికారి అవుతాడు. శ్రీహరి చింతామణిని ప్రోత్సహించి సుబ్బిశెట్టి ( రేలంగి )అనే వ్యాపారిని ఆకర్శించి అతని ఆస్తి అంతా స్వాహా చేస్తుంది.

chinthamani-movie

బిల్వమంగళుడు (ఎన్టీఆర్) బంగారు వ్యాపారి. అందగాడు, సజ్జనుడు, సంగీత, సాహిత్య అభిమాని. , బిల్వమంగళుడు ఆ శవం తన భార్య రాధ గా గుర్తించి రోదిస్తాడు. అతని మిత్రుడైన బిల్వమంగళుడిని తన దగ్గరకు తీసుకొని రమ్మని అడుగుతుంది, అంగీకరించని అతను ఆ తరువాత వచ్చి , చింతామణి అందానికీ భ్రమసి ఆమె వ్యామోహం లో పడిపోతాడు. అతని తాండ్ర మరణసేయ్య పై వున్నాడని తెలిసి, బిల్వమంగళుణ్ణి ఇంటికి పంపుతుంది, అనారోగ్యం తో వున్నా అతని తండ్రి సాని వ్యామోహం మాని, భార్యకు న్యాయం చెయ్యమని అడిగి మరణిస్తాడు.

sv-rangarao

దహన సంస్కారాలు చెయ్యకుండా , బిల్వమంగళుడు చింతామణి దగ్గరకు బయలు దేరుతాడు. పెను తుఫాను వచ్చి, నది పొంగు తుంటుంది, చింతామణి ఇంటికి పోవాలంటే నది దాటాలి. భర్త కు ప్రమాదం జరుగుతుందేమో నని , అతని వెనుక వచ్చి రాధా ప్రమాదవసాత్తు నది లో పడి మరణిస్తుంది. బల్లకట్టు తెగిపోవడంతో, నదిలో కొట్టుకొస్తున్న ఒక దేహాన్ని ఆధారంగా తీసుకొని నది ఒడ్డు చేరుతాడు బిల్వమంగళుడు. చింతామణి ఇంటి మీద పైకి చేరడం కోసం, పొడవాటి తీగ పట్టుకొని పై కి చేరి చింతామణి ని కలుస్తాడు అతని వంటి మీద వున్నా రక్తపు మరకలు చూసిన ఆమె , విషయం విని చూడగా అది పెద్ద పామని గ్రహిస్తుంది. శవం ఆదా రంతో తను ఒడ్డు చేరానని చ్చేప్పడం తో అతని తో కలసి నది తీరానికి రాగా , ఆ శవం తన భార్య రాధ దని గుర్తించిన బిల్వమంగళుడు రోదిస్తాడు.

sv-rangarao

ఈ పాపాలన్నింటికే తానే కారణమని గుర్తించిన చింతామణి, బిల్వమంగళుని కళ్ళు తెరిచి సత్యం గ్రహించమని మందలిస్తుంది, తప్పు తెలుసుకున్న అతను, భార్య శవానికి దహన సంస్కారాలు చేసి, పాప ప్రక్షాళన కోసం తన రెండు కళ్ళు పొడుచుకొని, అంధునిగా మారి, ఒక ఆశ్రమం కట్టుకొని శ్రీకృష్ణుని సేవిస్తుంటాడు. పశ్చాతాపంతో వున్న చింతామణికి శ్రీకృష్ణుడు కలలో కనిపించి హితబోధ చేస్తాడు. మారిపోయిన చింతామణి తన ఆస్తినంతా పేదలకు పంచి, ఆశ్రమానికి వచ్చి బిల్వమంగళునికి సేవకు చేస్తుంటుంది, వారికి ముక్తిని ప్రసాదించాలనుకున్న శ్రీకృష్ణుని రుక్మిణి వారించి, వారికి అట్టి అర్హత లేదని అంటుంది.

chinthamani-movie

వాళ్ళ అర్హత పరీక్షించి డానికి వస్తారు. శ్రీకృష్ణుడు తన వంటి పరిమళాన్ని ద్రవంగా మార్చి, ఒక భరిణ లో ఉంచి , మునులకు, యోగులకు చూపించి ఆ ద్రవణం వాసన ఏమిటో గ్రహించి చెప్పమంటాడు, ఎవ్వరు చెప్పలేరు, బిల్వమంగళుడు అది శ్రీకృష్ణ పరమాత్మ పరిమళం అని గుర్తించి, చెప్పి, శ్రీ కృష్ణా స్తోత్రం చేస్తాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయి, వారికి ముక్తి ప్రసాదించడం తో సినిమా ముగుస్తుంది. రామకృష్ణ ఈ సినిమాను బాగా తీశారు కానీ సెన్సార్ వాళ్ళు 2000 అడుగులకు పైగా కత్తిరించడంతో, హాస్య సన్నివేశాలన్నీ తొలగిపోయి, సినిమా పేలవంగా మిగిలింది . ప్రేక్షకుల కు నిరాశ కలిగించింది.అందుకే విజయవంతం కావలసిన ఈ సినిమా యావరేజ్ చిత్రంగా ఆడింది.

error: Content is protected !!