Tue. Dec 17th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి25th ,2022: ఒక్కో సందర్భం… ఒక్కో వస్తువుకు మార్కెట్ లో డిమాండ్ పెంచుతుంది. వస్తువుకు డిమాండ్ పెరగడానికి సందర్భమే కాదు… ఆ వాస్తు వినియోగం కూడా ఆ వస్తువుకు ఎక్కడాలేని విలువను కల్పిస్తుంది…అటువంటి జాబితాలో ఓ టాబ్లెట్ చేరింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో అదే అందరి ప్రాణాలను నిలబెట్టే సంజీవనిగా మారింది. అదే డోలో650… ట్యాబ్లేట్.. ఈ డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లేట్..గురించి చాలామందికి తెలియని నిజాలు..ఇప్పుడు మనం తెలుసుకుందాం..

2020సంవత్సరంలో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి 350 కోట్లకు పైగా యాంటీ ఫీవర్ ట్యాబ్లేట్లను భారత్ విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతదేశంలో విక్రయించిన 350 కోట్ల టాబ్లెట్‌లను నిలువుగా పేర్చితే, ఇది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన ఎవరెస్ట్ శిఖరం కంటే దాదాపు 6,000 రెట్లు ఎక్కువగా ఎత్తు ఉంటుంది. అంతేకాదు ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా టవర్ కంటే దాదాపు 63,000 రెట్లు ఎత్తు ఉంటుంది.డోలో సిక్స్ ఫిఫ్టీ 1.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. గత రెండేళ్లలో పారాసెటమాల్ టాబ్లెట్, క్రోసిన్ కంటే ఎక్కువగా అమ్ముడైన టాబ్లెట్ ఇదే.

కోవిడ్-19 లక్షణాలు అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటైన జ్వరానికి ఇది సరైన ముందుగా వైద్యులు సూచిస్తున్న మాత్ర ఇదే..దీని అమ్మకాలు గత రెండేళ్లలో రెట్టింపు అయ్యాయి. ఓ పరిశోధనా సంస్థ వెల్లడించిన డేటా ప్రకారం, 2019లో కోవిడ్-19 వ్యాప్తి చెందడానికి ముందు భారతదేశం సుమారు 7.5 కోట్లడోలో స్ట్రిప్‌ల విక్రయించింది. ఒక స్ట్రిప్‌లో 15 టాబ్లెట్‌లు ఉంటాయి.

error: Content is protected !!