
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 7,2021: టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ మరోసారి తన సత్తా చాటింది. జావెలిన్ త్రోలో భారత్‌కు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా తన సత్తా చాటాడు. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించాడు. 87.58 మీటర్ల దూరం విసిరి.. స్వర్ణపతకాన్ని చేజిక్కించుకున్నాడునీరజ్. మిగితా అథ్లెట్లు ఎవ్వరూ ఆ దూరాన్ని ఛేదించకపోవడంతో నీరజ్.. గోల్డ్ మెడల్ సాధించాడు.అయితే.. ప్రస్తుతం ఎవ్వరి నోట విన్నా నీరజ్ చోప్రా గురించే చర్చిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆయన స్వస్థలం ఏది? అనే విషయాల గురించి అందరూ ఆసక్తిగా వెతుకుతున్నారు.

నీరజ్ చోప్రాది హర్యానాలోని పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామం. నీరజ్ చోప్రా తండ్రి రైతు. చిన్నప్పుడు నీరజ్‌కు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది. కానీ.. తర్వాత 11 ఏళ్ల వయసు అప్పుడే జావెలిన్ మీద ఆసక్తి ఏర్పడింది. పానిపట్ స్టేడియంలో జైవీర్ అనే అథ్లెట్.. జావెలిన్ ప్రాక్టీస్ చేస్తుంటే చూసి నీరజ్‌కు కూడా జావెలిన్ నేర్చుకోవాలనే కుతూహలం ఏర్పడింది. అలాజజ పంచ్‌కులలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉండి జావెలిన్‌లో శిక్షణ తీసుకున్నాడు నీరజ్. అతడి తల్లి సరోజ్ దేవి గృహిణి. నీరజ్‌కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నీరజ్ చోప్రా.. 24 డిసెంబర్, 1997 లో జన్మించాడు. ప్రస్తుతం నీరజ్ చోప్రా వయసు 23 ఏళ్లు.
ప్రస్తుతం నీరజ్ చోప్రా.. ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో)గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

జావెలిన్ త్రోలో తన సొంత నేషనల్ రికార్డును తానే బ్రేక్ చేసి.. 88.07 మీటర్ల త్రోతో టాప్‌లో నిలిచాడు.2018 ఏషియన్ గేమ్స్, 2018 కామన్ వెల్త్ గేమ్స్‌లో 88.6 మీటర్ల త్రో చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. 2016 వరల్డ్ అండర్ 20 చాంపియన్‌గానూ నిలిచాడు. అండర్ 20లో 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డును నీరజ్ క్రియేట్ చేశాడు