Tue. Dec 17th, 2024
Railwayprotection-force_365

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 27,2023:1957 భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఆస్తుల రక్షణ ,భద్రత కోసం ఆర్పీఎఫ్ చట్టం కింద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు.

రైల్వే ఆస్తుల అన్యాకాంత్రం కాకుండా అలాగే రైల్వే ఆస్తుల ఏవైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించడం వంటి చర్యలు చేపట్టేందుకు రైల్వే ఆస్తి (చట్టవిరుద్ధమైన వాటిని స్వాధీనం) చట్టం, 1966 నిబంధనల ప్రకారం రైల్వే ఆస్తులపై నేరాల కేసులను పరిష్కరించడానికి ఆర్ పి ఎఫ్ కు అధికారం ఉంది.

Railwayprotection-force_365

[ఆర్ పి (యుపి) యాక్ట్].2004 నుంచి రైల్వే ప్రయాణీకుల ప్రాంతం, రైల్వే ప్రయాణీకుల భద్రత బాధ్యత ఆర్పిఎఫ్ కు అప్పగించబడింది. రైల్వే ప్రయాణికులు, రైల్వే ఆస్తులను రక్షించడంలో, ప్రయాణీకుల ప్రయాణంలో భద్రతను కల్పించడంలో నేరస్థులకు వ్యతిరేకంగా ఈ దళం అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుంది.

మహిళలు, పిల్లల అక్రమ రవాణా , రైల్వే ప్రాంగణాల్లో నిరుపేద పిల్లలకు పునరావాసం కల్పించడంలో కుడా ఆర్పిఎఫ్ ముందంజలో వుంది. కేంద్ర రక్షణ దళం ర్యాంకుల్లో అత్యధిక మహిళల 9శాతం వాటాతో ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.

error: Content is protected !!