365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు19, 2022: ఆగస్టు 19తేదీ ఫోటోగ్రఫీ ప్రియులందరికీ పండుగరోజు. 1839 వ సంవత్సరంలో ఆగస్టు 19 న ఎల్.జె.ఎమ్. డాగురే సిల్వర్ అయుడైడ్ విధానం ద్వారా దృశ్యాన్ని శాశ్వతంగా పదిల పరచవచ్చు అని నిరూపించారు. ఫ్రాన్స్ కు చెందిన అకాడమి అఫ్ ఆర్ట్స్, అకాడమి అఫ్ సైన్సెస్ సంస్థల సంయుక్త సమావేశంలో ఈ ప్రక్రియను ప్రశంసిస్తూ డాగొరే టైపు ఫోటోగ్రఫీకి ఆమోద ముద్ర వేసింది.
డాగొరేకీ ముందు జోసఫ్ నీస్ఫర్ నిప్సి పద్దతిలో ఒక ఫోటో ని రికార్డు చేయడానికి 8 గంటల సమయం పట్టేది. డాగురే టైపు కెమెరా ఈ సమయాన్ని అరగంటకు తగ్గించింది. ఈ దీంతో ఇంగ్లాండ్ కు చెందిన రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ మరికొన్ని సంస్థలు సైతం డాగురే టైపు కెమెరాను ప్రామాణికంగా తీసుకొని మరిన్ని ప్రయోగాలు చేసి నిర్దారించి ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా ప్రకటించారు.
1839లో ఆగష్టు19న ఫ్రాన్స్ డాగ్యురోటైప్ కోసం పేటెంట్‌ను కొనుగోలు చేసింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రారంభాన్ని సూచిస్తూ ‘ప్రపంచానికి ఉచితంగా’ విడుదల చేసింది. ఇమేజ్‌ని ప్రాసెస్ చేయడానికి ఎనిమిది గంటల సమయంపట్టేది. ఇప్పుడు ఆడేటెక్నాలజీ ని ఉపయోగించి మొబైల్స్ ద్వారా ఫోటోలు తీసుకునేంతగా ఫోటోగ్రఫీ డెవలప్ అయ్యింది.
డాగ్యురోటైప్ మొదటి ఆచరణాత్మక ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ అయితే, హెలియోగ్రఫీ అనేది 1826లో జోసెఫ్ నిసెఫోర్ నీప్సే అభివృద్ధి చేసిన శాశ్వత ఛాయాచిత్రాలు తీయాలంటే అంతకుముందు మరింత క్లిష్టమయ్యేది.