365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 7,2022: చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. వాతావరణ మార్పుల వల్ల పలు రుగ్మతలు ఎదురవుతుంటాయి.
కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల సీజనల్ వ్యాధుల బారీ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందు కోసం “హెర్బల్ టీ” చక్కని పరిష్కార మార్గం. పసుపు సాంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తున్నారు.
సీజన్ మార్పు శరీర రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఫ్లూ, జ్వరానికి దారితీస్తుంది. అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి సీజన్‌కు అనుగుణంగా మన ఆహారాన్ని మార్చుకోవాలని వైద్యులు నొక్కి చెబుతు న్నారు.
చలికాలం, వర్షాకాలం జలుబు, ఫ్లూ,జ్వరం వంటి సమస్యలతో సహా అనేక కాలానుగుణ వ్యాధులు వస్తాయి. మూలికలు,సుగంధద్రవ్యాలను తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఈ విషయంలో పసుపు చాలా ప్రధానమైంది. పసుపు ను హిందీలో” హల్దీ” అంటారు. ప్రతిరోజూ అనేక వంటకాల్లో పసుపును వినియోగిస్తున్నారు.
పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి.వర్షాకాలంలో పసుపు ఆరోగ్య ప్రయోజనాలు: రోగనిరోధక శక్తి : పసుపు ప్రపంచవ్యాప్తంగా పురాతన భారతీయ సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా ప్రచారంలో ఉంది. ఇందులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది.
ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో నేకాకుండా అనేక రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూతో పోరాడుతుంది: రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, కర్కుమిన్ మనకు శరీరంలో ఉన్న చెడును బయటకు పంపడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది యాంటీ బాక్టీరియల్,యాంటీ-వైరల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన లిపోపాలి సాకరైడ్ అనే పదార్థాన్ని కూడా కలిగి ఉంది.
ఇది అజీర్తిని నివారిస్తుంది. అన్నవాహిక లో మంటను నివారిస్తుంది, ఆమ్లత్వం, అజీర్ణం, గుండెల్లో మంటలను నివారిస్తుంది. ముందుగా చెప్పినట్లుగా, పసుపు జీవక్రియను ప్రోత్సహించడంలో సహాయ పడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రేగు కదలికను పెంచడానికి మరింత సహాయపడుతుంది.
అంతేకాకుండా, యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ క్రియకు ఆరోగ్య ఏజెంట్లుగా పనిచేస్తాయి. లివర్ ఆరోగ్యాన్ని పెంచుతాయి: పసుపు కాలేయాన్ని సంరక్షిస్తుంది. ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ముఖ్యమైన ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.
హల్దీ చాయ్ ఎలా తయారుచేయాలి..?
హల్దీ చాయ్ లేదా పసుపు టీ : హల్దీ చాయ్ ఎలా తయారు చేయాలి?: పసుపు, అల్లం, నల్ల మిరియాలు, తేనె, నీరు అవసరం. ఒక పాత్రలో నీరు తీసుకుని మరిగించాలి. నీటిలో తేనె మినహా అన్ని పదార్థాలను యాడ్ చేయాలి.
ఆయా పదార్థాలను ఉడకబెట్టి, నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. కొంచెం తేనెతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా అనేక సీజనల్ వ్యాధుల నుంచి బయట పడొచ్చు.